ఇండియన్ రైల్వే పర్యాటకరంగాన్ని విస్తరిస్తూ.. రైల్వే ఆదాయాన్ని పెంచుకొనేలా కొత్త ఆలోచనలను అమలు చేస్తోంది. అందులో భాగంగా నూతనంగా రైలు బోగీల లీజుకిచ్చే వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. రైలు బోగీలను లీజుకు తీసుకొని వాటిని సాంస్కృతిక, మతపరమైన పర్యాటకానికి వినియోగించుకోవచ్చని సూచిస్తోంది. మార్కెటింగ్, ఆతిథ్యం, సేవల అనుసంధానం, కస్టమర్ బేస్‌తో చేరుకోవడమే లక్ష్యంగా మంత్రిత్వ శాఖ కృషిచేస్తోందని ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే కొన్ని రైళ్లను లీజుకు ఇచ్చే ప్రక్రియ మొదలు పెట్టిన రైల్వే శాఖ కొత్తగా బోగీల లీజు ప్రారంభించింది.
* ఆసక్తిగ వారు ఎవరైన రైలు బోగీలను లీజుకు తీసుకోవచ్చు.
* లీజుకు తీసుకొన్న బోగీలను లీజుకు తీసుకొన్న వ్యక్తి ఇష్టమైన ఆకృతిలో తీర్చుదిద్దుకోవచ్చు.
* కనీసం లీజు పరిమితి 5 సంవత్సరాలు
* కోచ్ లీజును జీవితంకాలం పొడిగించుకోవచ్చు.
* రూట్లు, టారిఫ్ నిర్ణయాధికారం అద్దెకు తీసుకొనే వారికే ఉంటుందని రైల్వే శాఖ తెలిపింది.
* ఈ బోగీలు సాంస్కృతిక, మతపరమైన ఇతర పర్యటక సర్క్యూట్ రైళ్లుగా నూతన యాత్రికులను ఆకర్షించడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.ఇండియాలో నాణ్యమైన టూరిజానికి ఇది కొత్త బాటలు వేస్తుందని రైల్వే అధికారులు అభిప్రాయ పడుతున్నారు. టూరిజంకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని కొత్త విధానానికి రైల్వే శ్రీకారం చుట్టింది.నడపొచ్చని రైల్వే శాఖ అభిప్రాయపడింది.
0 Comments