Ad Code

పాక్ పాత్రపై మోదీతో కమలాహారిస్‌ చర్చ

  

అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ ఉగ్రవాదంలో పాకిస్తాన్  పాత్ర గురించి చర్చించారు. వైట్ హౌస్ లో జరిగిన సమావేశంలో ఇండో-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేయాలని ఇద్దరు నేతలు నిర్ణయించుకున్నారు. పాకిస్తాన్ లో పలు ఉగ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయని, ఈ విషయంలో ఇస్లామాబాద్ పై చర్యలు తీసుకోవాలని కమలాహారిస్ కోరారు. ఉగ్రవాదుల ప్రభావం అమెరికా, భారతదేశాలపై పడకుండా చర్యలు తీసుకోవాలని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ కోరారని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి పేర్కొన్నారు. దశాబ్దాలుగా భారతదేశం ఉగ్రవాద బాధిత దేశంగా ఉందని, ఉగ్రవాద గ్రూపులకు పాక్ మద్ధతును నిశితంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని కమలాహారిస్ ప్రధానమంత్రి మోదీతో వ్యాఖ్యానించారు. అమెరికా, భారతదేశాల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం రెండు దేశాల బాధ్యత అని కమలాహారిస్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, అఫ్ఘానిస్థాన్, ఇండో-పసిఫిక్ వంటి ముప్పులతో సహా ఉమ్మడి ఆసక్తి ఉన్న ప్రపంచ సమస్యలపై ఇద్దరు నేతలు చర్చించారు.కొవిడ్ మహమ్మారి ప్రబలిన సమయంలో భారతదేశానికి మద్ధతు అందించిన కమలాహారిస్ కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.భారతదేశాన్ని సందర్శించాలని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ ను ప్రధాని మోదీ ఆహ్వానించారు. 

Post a Comment

0 Comments

Close Menu