Ad Code

వాట్సప్ వాయిస్ మెసేజ్ ట్రాన్స్‌స్క్రిప్షన్ ?



యూజర్ల కోసం వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. సరికొత్త ఫీచర్స్‌తో ఆకట్టుకుంటూ ఉంటుంది. వాట్సప్ అందించే ఫీచర్స్ బాగా పాపులర్ అవుతుంటాయి. ఇప్పుడు మరో అదిరిపోయే ఫీచర్ రూపొందించేందుకు వాట్సప్ కసరత్తు చేస్తోంది.  వాయిస్ మెసేజ్ ట్రాన్స్‌స్క్రిప్షన్' పేరుతో మరో అద్భుతమైన ఫీచర్‌ను టెస్ట్ చేస్తోంది. వాయిస్ మెసేజ్‌ను టెక్స్‌ట్‌గా మార్చే టూల్ ఇది. మీకు ఎవరైనా వాయిస్ మెసేజెస్ పంపిస్తే వినాల్సిన అవసరం లేదు. టెక్స్‌ట్‌గా మార్చడానికి ఈ టూల్ ఉపయోగపడుతుంది.  ఇటీవల వాయిస్ మెసేజెస్ ప్లేబ్యాక్ స్పీడ్ మార్చుకునే అవకాశం కల్పించింది వాట్సప్. పెద్దగా ఉండే వాయిస్ మెసేజెస్‌ను వేగంగా వినడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. వాయిస్ మెసేజెస్ వినకుండా చదవాలనుకునేవారికి 'వాయిస్ మెసేజ్ ట్రాన్స్‌స్క్రిప్షన్' టూల్ ఉపయోగపడుతుంది. ఈ టూల్ సాయంతో వాయిస్ మెసేజెస్‌ను ఒక్క క్లిక్‌తో టెక్స్‌ట్ మెసేజ్‌గా మార్చుకోవచ్చు. 'వాయిస్ మెసేజ్ ట్రాన్స్‌స్క్రిప్షన్' ఫీచర్‌ను ప్రస్తుతం వాట్సప్ టెస్ట్ చేస్తోంది. ఈ ఫీచర్ యూజర్లకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న స్పష్టత లేదు. ఎప్పుడు వచ్చినా ఈ ఫీచర్‌కు వాట్సప్ యూజర్లలో క్రేజ్ రావడం ఖాయం. వాట్సప్‌కు సంబంధించిన ఫీచర్స్, ఇతర సమాచారాన్ని ప్రపంచానికి తెలియజేసే WABetaInfo ముందుగా 'వాయిస్ మెసేజ్ ట్రాన్స్‌స్క్రిప్షన్' ఫీచర్‌ను గుర్తించింది. వాట్సప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ బీటా వర్షన్లలో ఈ ఫీచర్ ఉంది. ఈ ఫీచర్ ఆప్షనల్ మాత్రమే. అంటే కావాలనుకుంటే ఈ ఫీచర్ ఉపయోగించుకోవచ్చు. లేదా వాయిస్ మెసేజ్ నేరుగా వినొచ్చు. ఈ ఫీచర్ వాడుకోవాలంటే స్మార్ట్‌ఫోన్‌లోని మైక్రోఫోన్, స్పీచ్ రికగ్నిషన్ టూల్ పర్మిషన్ ఇవ్వాలి. 

Post a Comment

0 Comments

Close Menu