రీఛార్జ్ ప్లాన్‌లు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటి ధర రూ .150 కంటే తక్కువ. ఇందులో అపరిమిత కాలింగ్ సౌకర్యం, ఇంటర్నెట్ డేటా 28 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. దీనితో పాటు వినోదాన్ని అందించే యాప్ లకు యాక్సెస్ పూర్తిగా ఉచితం.
జియో రీఛార్జ్ రూ.150
రిలయన్స్ జియో అధికారిక వెబ్‌సైట్‌లో అనేక రీఛార్జ్ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో వివిధ ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. జియో రూ .150 కంటే తక్కువగా రెండు రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. అందులో రూ.149 ఒకటి. రెండోది రూ.98. రూ.149 ప్లాన్ అపరిమిత కాల్‌లను అందిస్తుంది. ఇది 24 రోజుల పాటు ఉంటుంది. ఈ ప్లాన్ కింద వినియోగదారులు రోజుకు 1 జీబీ ఇంటర్నెట్ డేటాను, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు పొందొచ్చు. ఈ ప్లాన్ కింద వినియోగదారులు JioTV, JioCinema, JioNews, JioSecurity, JioCloud వంటి యాప్‌లకు ఫ్రీగా యాక్సెస్ పొందుతారు. జియో రెండవ రీఛార్జ్ ప్లాన్ రూ.98. ఈ ప్లాన్ కింద కూడా వినియోగదారులు అపరిమిత కాల్‌లు మరియు రోజువారీ 1.5 GB ఇంటర్నెట్ డేటాను పొందుతారు. ఈ ప్లాన్ చెల్లుబాటు 14 రోజులు. అయితే అందులో ఎస్ఎంఎస్ సదుపాయం లేదు. జియో యాప్‌లను ఉపయోగించవచ్చు.
వొడాఫోన్-ఐడియా రూ.150 రీఛార్జ్
వోడాఫోన్-ఐడియా (Vi) టెలికాం కంపెనీ రూ.249కి 28 రోజుల పాటు అపరిమిత కాలింగ్ సదుపాయాన్ని అందిస్తోంది. ఈ ప్లాన్ కింద, వినియోగదారులు 2 జీబీ డేటా, 300 ఎస్ఎంఎస్ లను పొందుతారు. మరో ప్లాన్‌లు రూ. 99. 200 ఎంబి ఇంటర్నెట్ డేటా ఇందులో ఉంది. ఎస్ఎంఎస్ ఆప్షన్ లేదు. ఈ ప్లాన్ చెల్లుబాటు 18 రోజులు. మూడవ ప్లాన్ రూ .129. ఇది 24 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ కింద వినియోగదారులు 1 జిబి ఇంటర్నెట్ డేటాను పొందుతారు.
రూ.150 నుంచి ఎయిర్‌టెల్ చౌక ప్లాన్‌లు
ఎయిర్‌టెల్ రూ.150 లోపు అనేక మంచి రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది, అందులో ఒక ప్లాన్ ధర రూ .149. ఈ ప్లాన్ కింద, వినియోగదారులు అపరిమిత కాల్స్ తో పాటు మొత్తం 2 జీబీ డేటాను పొందుతారు. రెండవ ప్లాన్ రూ .129. ఇది 24 రోజుల చెల్లుబాటు లభిస్తుంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు అపరిమిత కాల్స్ తో పాటు, 1 జీబీ డేటాను ఉపయోగించవచ్చు.
0 Comments