వాట్సప్ ఇటీవలే పేమెంట్ ఆప్షన్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆండ్రాయిడ్‌తో పాటు.. ఐవోఎస్ యూజర్లకు కూడా పేమెంట్ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రముఖ వాలెట్స్ ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం లాంటి యాప్స్‌కు పోటీగా వాట్సప్ పేమెంట్ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ఆ పేమెంట్ ఆప్షన్‌లో ఆకర్షణీయమైన బ్యాక్‌గ్రౌండ్స్, థీమ్స్‌ను ఇటీవలే యాడ్ చేసిన వాట్సప్.. తాజాగా పేమెంట్ షార్ట్‌కట్‌ను తీసుకొచ్చింది. వాట్సప్ చాట్ బార్‌లోనే పేమెంట్ షార్ట్‌కట్‌ను వాట్సప్ తీసుకురానుంది. అయితే.. ఈ ఫీచర్‌ను ప్రస్తుతం బీటా వర్షన్‌లో విడుదల చేసి టెస్ట్ చేయనుంది. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. అయితే.. ఇంకా ఇది డెవలప్‌మెంట్ స్టేజ్‌లోనే ఉందట. ఈ పేమెంట్ ఫీచర్‌తో వాట్సప్ యూజర్లు.. మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. మనీ రిసీవ్ చేసుకోవచ్చు. ఐవోఎస్ యూజర్లకు కూడా ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుందట. అయితే.. ఐవోఎస్‌లో కూడా బీటా టెస్టింగ్ చేస్తున్నారు. ఈ ఫీచర్‌తో పాటు.. వాట్సప్.. మల్టీ డివైజ్ 2.0 మీద వర్క్ చేస్తోంది. ఈ ఫీచర్‌తో ఐపాడ్ లాంటి డివైజ్‌లలో కూడా వాట్సప్‌ను లింక్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్‌లో కూడా వాట్సప్‌ను లింక్ చేసేందుకు వాట్సప్ వర్క్ చేస్తోంది.
0 Comments