పెద్ద పెద్ద నగరాలలో 3000 వైఫై రూటర్లను అమర్చేందుకు సన్నద్ధం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. నగరంలోని ప్రతి మూలన ఎక్కడ ఉన్నా సరే ఇంటర్నెట్ వచ్చే విధంగా ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనిని ఆగస్టు 4 వ తేదీన రాష్ట్ర శాఖ మంత్రి వీటిని ప్రారంభించనున్నారు. ఇటువంటి ఉచిత వైఫై పథకాన్ని 2015 లోనే hifi అనే పేరుతో ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఇంటర్నెట్ ఉన్నచోట ప్రతి ఒక్కరికి 5 mbbs స్పీడ్ కలిగిన ఇంటర్నెట్ ను అందించనుంది. తెలంగాణ ప్రభుత్వం తో పాటు ACT అనే ఒక సంస్థతో చేతులు కలిపి , ఈ సేవలను హైదరాబాద్ నగరవాసులకు అందించడం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల దేశంలోని ఎటువంటివి జరిగినా తెలుసుకోవచ్చు. అంతేకాదు ఈ వైఫై వల్ల విద్యార్థులకు కూడా మంచి ప్రయోజనం చేకూరుతుందని చెప్పొచ్చు.
0 Comments