Ad Code

ముగియనున్న ఫ్లిప్‌కార్ట్‌ బొనాంజా సేల్


ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్స్ బొనాంజా సేల్ ఇంకొన్ని గంటల్లో ముగియనుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్‌తో పాటు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. రియల్‌మీ కొద్ది రోజుల క్రితం రిలీజ్ చేసిన రియల్‌మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ ఆఫర్ ఉంది. రియల్‌మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయినప్పుడు 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999 కాగా, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999. ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్స్ బొనాంజా సేల్‌లో రియల్‌మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై రూ.2,000 తగ్గింది. అంటే 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.24,999 ధరకు, 12జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ.27,999 ధరకు కొనొచ్చు. ఇక రియల్‌మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై రూ.15,000 వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది. మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేసి రూ.15,000 వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. మీ పాత మొబైల్‌కు ఎక్స్‌ఛేంజ్‌లో రూ.15,000 డిస్కౌంట్ లభిస్తే 8జీబీ+128జీబీ వేరియంట్‌కు మీరు రూ.9,999 చెల్లిస్తే చాలు. 12జీబీ+256జీబీ వేరియంట్‌కు రూ.12,999 చెల్లించాలి. ఇంత తక్కువకు మీకు స్మార్ట్‌ఫోన్ కావాలంటే ఎక్స్‌ఛేంజ్‌లో మీ పాత మొబైల్ రూ.15,000 విలువ చేయాలి. ఒకవేళ ఎక్స్‌ఛేంజ్‌లో మీ పాత స్మార్ట్‌ఫోన్‌కు రూ.15,000 కన్నా తక్కువ ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ వస్తే మీరు మిగిలిన మొత్తం చెల్లించి రియల్‌మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఎక్స్‌ఛేంజ్‌లో కాకుండా నేరుగా ఈ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే ఇతర ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ అప్‌గ్రేడ్ ప్లాన్‌లో రూ.7,500 తక్కువకే ఈ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. క్రెడిట్ కార్డ్, బజాజ్ ఫిన్‌సర్వ్ ఈఎంఐ కార్డ్ ద్వారా ఈ ఆఫర్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుతో కొంటే 5 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐ కార్డ్స్, మొబీక్విక్ జారీ చేసిన అమెక్స్ నెట్వర్క్ కార్డ్స్ ద్వారా మొదటి ట్రాన్సాక్షన్‌తో కొంటే 20 శాతం తగ్గింపు లభిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా మాస్టర్‌కార్డ్ డెబిట్ కార్డ్‌తో మొదటి ట్రాన్సాక్షన్ ద్వారా కొంటే 10 శాతం తగ్గింపు లభిస్తుంది. ఇక రియల్‌మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 6.43 అంగుళాల సూపర్ అమొలెడ్ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1200 5జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియల్‌మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ Sony IMX682 ప్రైమరీ సెన్సార్‌ + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ యాంగిల్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్. రియల్‌మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 4,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 65వాట్ సూపర్ డార్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 11 + రియల్‌మీ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఆస్టరాయిడ్ బ్లాక్, మెర్క్యురీ సిల్వర్, మిల్కీ వే కలర్స్‌లో కొనొచ్చు. 

Post a Comment

0 Comments

Close Menu