Ad Code

సెమిస్ లో భారత మహిళా హాకీ జట్టు

 

ఇండియన్ మహిళా హాకీ జట్టు క్వార్టర్స్‌లో బలమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాను అన్ని విధాలుగా కట్టడి చేసి కోలుకోలేని  దెబ్బతీసి 1-0 తేడాతో గెలిచి సెమీస్ కు అర్హత సాధించింది. క్వార్టర్స్‌కు ముందు జరిగిన పూల్‌ 'ఎ' మ్యాచ్‌లలో భారత్‌ లీగ్‌ దశలో 2 గెలిచి, మూడింటిలో ఓడింది. మొత్తంగా 7 గోల్స్‌ చేసి, 14 గోల్స్‌ సమర్పించుకుంది. మరోవైపు పూల్‌ బీలో ఆస్ట్రేలియా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓటమెరుగకుండా ముగించి టీమిండియా చేతిలో పరాజయం పాలైంది. ఇటు స్ట్రైకర్లు.. అటు డిఫెన్స్‌ టీం చక్కగా రాణించడంతో భారత్‌ ను గెలుపు వరించింది. 1980 మాస్కో ఒలింపిక్స్‌ తర్వాత అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత్.. తొలిసారి ఒలింపిక్స్‌లో సెమీస్‌ చేరింది. గుర్జీత్‌ కౌర్‌ ఈ మ్యాచ్‌లో భారత్‌కు తొలి, ఏకైక గోల్‌ను అందించి ప్రత్యేకంగా నిలిచారు. బలమైన జట్టుగా పేరున్న ఆస్ట్రేలియా, హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఒక్క గోల్‌ కూడా చేయకుండానే నిష్క్రమించింది. 

Post a Comment

0 Comments

Close Menu