Ad Code

ఆ మెషిన్ కావాలి : ఆనంద్ మహీంద్రా

 

సోషల్ మీడియాలో ఎప్పుడూ  యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా  గురించి తెలియని వారుండరు. ఆయన ట్విట్టర్ వేదికగా అప్ లోడ్ చేసే ఇంట్రెస్టింగ్, డిఫరెంట్ అండ్ యూనిక్ కంటెంట్ కోసం నెటిజనాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. 'మండే మోటివేషన్' పేరిట ఆనంద్ మహీంద్రా షేర్ చేసే వీడియోస్ ఎంతో ఇన్‌స్పిరేషనల్‌గా ఉంటాయి. ఇకపోతే సాధారణ సందర్భాల్లోనూ ఆనంద్ మహీంద్రా మంచి వీడియోస్ అప్‌లోడ్ చేస్తుంటారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ ద్వారా పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఇంతకీ ఆయన దేని గురించి ట్వీట్ చేశారంటే..

తనకు టైమ్ మెషిన్ కావాలంటూ ట్విట్టర్ పోస్టులో కోరారు. ఆ మెషిన్ ఉపయోగించి వెంటనే తనను గడిచిన కాలంలోకి తీసుకెళ్లాలని ఆనంద్ మహీంద్రా అభ్యర్థించారు. ఈ క్రమంలోనే ట్వీట్‌కు ఆయన 1903 నాటి ముంబై తాజ్‌ హోటల్‌ ఫొటోను జతపరిచారు. ఆయన ఎందుకు అలా తాజ్ ఫొటోను ట్యాగ్ చేశాడంటే.. ఆనాడున్న పరిస్థితుల్లో మన దేశంలోని ది బెస్ట్ హోటల్స్‌లో ఒకటి తాజ్ హోటల్ కాగా, 1903 డిసెంబర్‌ 1 దానిని ఓపెన్‌ చేశారు. ఆ సమయంలో తాజ్‌లో ఒక్కరోజు స్టే చేయడం కోసం అయ్యే ఖర్చు కేవలం ఆరు రూపాయలు మాత్రమే. ఈ సందర్భంగా తాజ్‌ హోటల్‌ ఓపెనింగ్‌ బ్రోచర్‌ను షేర్ చేసి తనను ఆ కాలంలోకి తీసుకెళ్లాలని కోరారు. అయితే, అప్పటి ధరల ప్రకారం అతి తక్కువగా కేవలం ఆరు రూపాయలు ఉండగా, ప్రజెంట్ కేవలం ఒక్క రోజుకు సుమారు ఇరవై వేల రూపాయల వరకు ఉంటుదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితులను అధిగమించేందుకు తనను టైం మెషిన్ సాయంతో ఆనాటి కాలానికి తీసుకెళ్లాలని కోరారు. ధరల పెరుగుదలను ఆనంద్ మహీంద్రా ఈ ట్వీట్ ద్వారా చెప్పకనే చెప్తున్నారు. కాగా, నెటిజన్లు తమను కూడా ఆ కాలానికి తీసుకెళ్లాలని కామెంట్స్ చేస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu