Ad Code

పట్టాలెక్కిన తేజస్

  


ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో నడుపుతున్న తేజస్ ఎక్స్ ప్రెస్  మళ్లీ పట్టాలెక్కింది. కరోనా వైరస్ మహమ్మారి వల్ల రద్దు అయిన తేజస్ ఎక్స్ ప్రెస్ రైలు ఎట్టకేలకు  పునర్ ప్రారంభం అయింది. అహ్మదాబాద్-ముంబై, లక్నో-న్యూఢిల్లీల మధ్య తేజస్ రైలు రాకపోకలు సాగించనుంది. 2019 అక్టోబరులో ప్రారంభమైన ఈ తేజస్ రైలు కరోనా వల్ల ఇన్నాళ్లు నిలిచిపోయింది. అత్యంత వేగంగా నడిచే ఈ రైలు ప్రయాణికులకు ఉచితంగా రూ.25 లక్షల బీమా సౌకర్యం కల్పించారు. 78 సీట్ల సామర్ధ్యం గల ఏసీ ఛైర్ కార్ బోగీలో ప్రయాణికులకు నాణ్యత గల ఆహారం అందజేస్తారు.ఈ రైలులో ఆర్వో వాటర్ ఫిల్టరుతోపాటు ప్యాకేజేడ్ వాటర్ బాటిళ్లను ప్రయాణికులకు అందుబాటులో ఉంచారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించిన తేజస్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించడానికి ఎక్కువ మంది ప్రయాణికులు ఆసక్తి చూపిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu