Ad Code

జూమ్‌ భారీ డీల్‌!

 


కరోనా నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్సింగ్ లకు అధిక డిమాండ్ ఏర్పడుతోంది. ఇందులో జూమ్ ఒకటి. ఫేస్ టు ఫేస్ మాట్లాడానికి అవకాశం లేకపోవడంతో…జూమ్ ద్వారా సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. దీనికి చాలా మంది కస్టమర్లు పెరిగిపోయారు. కస్టమర్లకు మరింత సేవలను అందించేందుకు జూమ్ కీలక ఒప్పందాలను చేసుకోబోతోంది. ప్రముఖ క్లౌడ్ సాఫ్ట్ వేర్ ప్రొవైడర్ ఫైవ్ 9ను కొనుగోలు చేయాలని భావిస్తోందని సమాచారం. సుమారు 14.7 బిలియన్ డాలర్ల (సుమారు రూ. లక్ష కోట్లతో) ఫైవ్ 9ను కొనుగోలు చేయాలని యోచిస్తోందని టాక్. ఫైవ్ 9 కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రోవాన్ ట్రోలోప్ జూమ్ సంస్థకు ప్రెసిడెంట్ కానున్నారు. ఈ రెండు కంపెనీల ఒప్పందం 2022 నాటికి ముగుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఫైవ్ 9 కంపెనీ క్లౌడ్ బేస్ట్ సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ప్రసిద్ధం. రెండు కంపెనీల బోర్డులదే ఆమోదం పొందిన తర్వాత..ఫైవ్ 9 కంపెనీ ప్రతి వాటాకు ఫైవ్ 9 స్టాక్ హోల్డర్లు క్లాస్ ఎ కామన్ స్టాక్ ఆఫ్ జూమ్ 0.5533 షేర్లను అందుకుంటారు.

Post a Comment

0 Comments

Close Menu