వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్ కూడా ఎయిర్‌టెల్ రూట్లోనే వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంది. కొన్ని సర్కిళ్లలో ఇప్పటికే కొత్త ప్లాన్‌లు అమలు చేస్తున్న వొడాఫోన్ ఐడియా.. త్వరలోనే దేశమంతా అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఎంట్రీ లెవెల్ ప్లాన్‌లను ఎక్కువ మొత్తానికి పెంచేయనుంది. ప్రస్తుతానికి మొబైల్ వినియోగదారుల్లో 90 శాతం మంది ప్రీపెయిడ్ వాడే వారే ఉన్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న ప్లాన్స్ వల్ల ఆర్థిక భారం ఎక్కువ అవుతుందనే ఉద్దేశంలో టెలికాం సంస్థలు ఉన్నాయి. దీంతో ఎంట్రీ లెవెల్ ప్లాన్లతో పాటు మరికొన్నింటిని పెంచేందుకు టెలికాం సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
ప్రీపెయిడ్ యూజర్లకే కాదు.. పోస్ట్ పెయిడ్ వినియోగదారులపైనా భారం వేసేందుకు ఎయిర్‌టెల్ నిర్ణయానికి వచ్చింది. పోస్ట్‌పెయిడ్‌లో కూడా ఎంట్రీ లెవెల్ ప్లాన్ ధరలను ఎంటర్‌ప్రైజ్ కస్టమర్లకు, రిటైల్ యూజర్లకు వేర్వేరు తరహాల్లో పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌టెల్‌ను ఫాలో అయ్యేందుకు వొడాఫోన్ ఐడియా కూడా సిద్ధమైంది. బిజినెస్ ప్లస్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ వినియోగిస్తున్న కార్పొరేట్ కస్టమర్లకు డాటా బెనిఫిట్స్‌ను తగ్గిస్తోంది. ఈ రెండు సంస్థలూ ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే రెవెన్యూ సగటును పెంచుకోవాలని భావిస్తున్నాయి.
ముఖ్యంగా వొడాఫోన్ ఐడియా ఆర్థిక ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకు టారిఫ్‌లను పెంచాలని భావిస్తోంది. కానీ, రిలయన్స్ జియో… కస్టమర్లను చేర్చుకుంటూ పోతోంది. ఏపీఆర్‌యూ వృద్ధికి అనుగుణంగా యూజర్లను పెంచుకుంటోంది. రాబడిని పెంచుకునేందుకు వొడాఫోన్ ఐడియా.. తక్షణమే టారిఫ్‌లను పెంచాల్సిన అవసరం ఏర్పడింది. ఆ సంస్థకు 22వేల కోట్ల రూపాయల బకాయిలు ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఉంటాయని అంచనా వేస్తోంది. వాటిని అధిగమించాలంటే టారిఫ్‌ల పెంపు ఒక్కటే మార్గమని భావిస్తోంది.
మహారాష్ట్ర, గుజరాత్ సర్కిళ్లలో తన 49 రూపాయల 28 రోజుల ప్లాన్‌ను 14 రోజులకు కుదించింది. 28 రోజుల ప్లాన్ కోసం 79 రూపాయలు చెల్లించాలి. తొందర్లోనే అన్ని రకాల టారిఫ్‌లు 30 నుంచి 35 శాతం పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
0 Comments