Ad Code

దూసుకెళ్తున్న పబ్‌జీ ఇండియా వర్షన్‌ !

 

గేమింగ్ ప్రియులకు పబ్‌జీ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పట్లో మొబైల్స్‌కు అతుక్కుపోయి మరీ ఈ గేమ్‌ను ఆడేవారు. కానీ భద్రత కారణాల రీత్యా పబ్‌జీని కేంద్రం ప్రభుత్వం నిషేధించింది.  దీంతో పబ్‌జీ ఇండియా వర్షన్‌ను బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్స్ ఇండియా పేరుతో తీసుకొస్తామని ప్రకటించింది. అన్ని అడ్డంకులను దాటుకుని జూలై 2న ఈ గేమ్ విడుదలైంది. అయితే ఈ గేమ్ లాంఛ్ అయిన వెంటనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ప్లే స్టోర్‌లో ఈ యాప్ దూసుకెళ్తోంది.

ప్లే స్టోర్‌లో ఈ వారం ఫ్రీ గేమ్స్‌లో టాప్‌లో నిలిచింది. కేవలం పదిరోజుల్లోనే ప్లే స్టోర్ నుంచి ఈ గేమ్‌ను 3.4కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ గేమ్‌కు 1.6 కోట్ల మంది డైలీ యాక్టివ్ వినియోగదారులు ఉన్నారని క్రాప్టన్ సంస్థ తెలిపింది. ఈ బ్యాటిల్ గ్రౌండ్ గేమ్‌కు వస్తున్న ఆదరణ పట్ల ఆ ఆ సంస్థ ఇండియా డివిజన్ హెడ్ వూ యెల్ ధన్యవాదాలు తెలిపారు. ఈ గేమ్ మరింత దూసుకెళ్తుందని అంచనా వేస్తున్నామన్నారు. భవిష్యత్తులో మరింత వినోదభరిత కంటెంట్‌ను గేమ్‌లో జత  చేస్తామని చెప్పారు. ప్రస్తుతానికి ఈ బాటిల్‌ గ్రౌండ్ మొబైల్స్ ఇండియా గేమ్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం మాత్రమే విడుదలైంది. ఐవోఎస్ వర్షన్ ఇంకా రెడీ కాలేదు. యూట్యూబ్‌లో జూలై 8న నిర్వహించిన గేమ్ లాంచ్ పార్టీ, టోర్నమెంట్‌ను 50 లక్షల మంది చూశారని క్రాప్టన్ సంస్థ ప్రకటించింది.


Post a Comment

0 Comments

Close Menu