జోమాటో ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 72-76గా నిర్ణయించబడింది. ప్రారంభ వాటా అమ్మకం కంటే ముందు యాంకర్ పెట్టుబడిదారుల నుండి రూ. 4,196 కోట్లకు పైగా వసూలు చేసినట్లు జోమాటో తెలిపింది. ఇండియన్ ఫుడ్ డెలివరీ స్టార్టప్ జోమాటో తన ఐపీఓలో విక్రయించడానికి ఉద్దేశించిన దానికంటే యాంకర్ పెట్టుబడిదారుల నుండి 35 రెట్లు ఎక్కువ బిడ్లను పొందింది. లావాదేవీల పరిమాణాన్ని మొత్తం రూ. 4,196.51 కోట్లకు కలిపి యాంకర్ ఇన్వెస్టర్లకు 55,21,73,505 ఈక్విటీ షేర్లను ఒక్కొక్కటిగా కేటాయించాలని కంపెనీ నిర్ణయించినట్లు బీఎస్ఈ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన సర్క్యులర్‌లో తెలిపింది.
బ్లాక్‌రాక్, టైగర్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఫండ్, ఫిడిలిటీ, న్యూ వరల్డ్ ఫండ్ ఇంక్, జేపీ మోర్గాన్, మోర్గాన్ స్టాన్లీ ఆసియా (సింగపూర్) పిటి-ఓడీఐ, గోల్డ్‌మన్ సాచ్స్ (సింగపూర్) పిటి-ఓడీఐ, టిరో, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డు, సింగపూర్ ప్రభుత్వం, మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ , అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ యాంకర్ పెట్టుబడిదారులలో ఉన్నారు.
యాంకర్ బిడ్డింగ్‌లో పాల్గొన్న దేశీయ పెట్టుబడిదారులలో కోటక్ మ్యూచువల్ ఫండ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్, యుటీఐ మ్యూచువల్ ఫండ్, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, ఐడీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్, సుందరం మ్యూచువల్ ఫండ్, ఎడెల్విస్ మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నాయి.
కోటక్ మహీంద్రా క్యాపిటల్, మోర్గాన్ స్టాన్లీ ఇండియా, క్రెడిట్ సూయజ్ గ్రూఫ్ ఏజీ, బోఫా సెక్యూరిటీస్, సిటీ గ్రూఫ్ ఇంక్ ఈ ఐపీఓను నిర్వహిస్తున్నాయి.
2020లో ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్ 1.4 బిలియన్ డాలర్ల వాటా అమ్మకం భారత్‌లో అతిపెద్దదిగా నిర్ణయించబడింది. అంటే జోమాటో రికార్డును త్వరలో డిజిటల్ చెల్లింపుల సేవా సంస్థ `పేటీఎమ్` అధిగమించగలదు. 2 బిలియన్ డాలర్ల ఐపీఓ కోసం `పేటీఎం` సిద్దమవుతుంది. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా జోమాటో, స్విగ్గీ మార్కెట్ ఆధిపత్యానికి పోటీ పడుతున్నాయి.
0 Comments