వన్‌ప్లస్ బులెట్ వైర్‌లెస్ జెడ్- బాస్ ఎడిషన్
రూ. 3 వేలలోపు లభించే అద్భుతమైన ఇయర్‌ఫోన్స్‌లో వన్‌ప్లస్ బుల్లెట్స్ వైర్‌లెస్ జెడ్ (బాస్ ఎడిషన్) ఇయర్‌ఫోన్స్ ఒకటి. వన్‌ప్లస్ ఆఫర్లలో భాగంగా వీటిని రూ. 1,899 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. వీటిలో మెరుగైన బాస్, రిచ్ సౌండ్ కోసం వీటిలో 9.2 ఎంఎం డ్రైవర్లను అందించారు. ఈ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్లు 100 ఎంఎస్ లో లాటెన్సీ, వార్ప్ ఛార్జ్ సపోర్ట్‌ను కలిగి ఉంటాయి. వీటిని కేవలం 10 నిమిషాల పాటు ఛార్జ్ చేస్తే చాలు 10 గంటల ప్లేబ్యాక్ అందిస్తాయి. ఈ వన్‌ప్లస్ బుల్లెట్ వైర్‌లెస్ జెడ్ బాస్ ఎడిషన్ మొత్తం 17 గంటల బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉంటాయి.
Samsung Galaxy A22 5G: సాంసంగ్ గెలాక్సీ ఏ22 5జీ సేల్ ప్రారంభం... రూ.1,750 వరకు డిస్కౌంట్
iPhone 12: ఐఫోన్ 12 ధర రూ.12,000 తగ్గింది... ఆఫర్ వివరాలు ఇవే
సోనీ WI-XB400
సోనీ WI-XB400 ఇయర్‌ఫోన్‌లు 12nm డ్రైవర్ యూనిట్‌తో వస్తాయి. వీటిని ప్రస్తుతం రూ .3,000 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇవి బ్లాక్, బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి. డీప్ మ్యూజిక్ కోసం వీటిలో ఎక్స్‌ట్రా బాస్ సౌండ్ సిస్టమ్‌ను అందించారు. ఈ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్‌లో 15 గంటల బ్యాటరీ లైఫ్, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్, బ్లూటూత్ వి 5, 10 మీటర్ల కనెక్టివిటీ వంటి ఫీచర్లను చేర్చింది.
రియల్‌మీ బడ్స్ వైర్‌లెస్ ప్రో
రియల్‌మీ బడ్స్ వైర్‌లెస్ ప్రోలో యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్, ట్రాన్స్పరెన్సీ మోడ్, లో లాటెన్సీ మోడ్, ఐపిఎక్స్ 4 వాటర్ రెసిస్టెన్స్, 13.6 ఎంఎం డైనమిక్ డ్రైవర్లను అందించింది. నెక్‌బ్యాండ్ తరహా ఈ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్లు ఎల్‌డిఎసి బ్లూటూత్ కోడెక్ సపోర్ట్‌తో వస్తాయి. ఇవి క్వాలిటీ సౌండ్‌ను అందిస్తాయి. వీటిని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే చాలు 22 గంటల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తాయి. జూలై 29 వరకు కొనసాగుతున్న రియల్‌మీ డేస్ సేల్‌లో భాగంగా వీటిపై రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. తద్వారా, దీని అసలు ధర రూ .3,999 ఉండగా.. రూ. 2,999 వద్ద కొనుగోలు చేయవచ్చు.
Poco F3 GT: కాసేపట్లో పోకో ఎఫ్3 జీటీ సేల్... డిస్కౌంట్ ఆఫర్స్ వివరాలివే
Redmi Note 10T 5G: కాసేపట్లో రెడ్‌మీ నోట్ 10టీ 5జీ సేల్... రూ.1,750 వరకు డిస్కౌంట్
అంకర్ సౌండ్‌బడ్స్ స్లిమ్
మీ అన్ని అవసరాలను తీర్చే అంకర్ సౌండ్‌బడ్స్ స్లిమ్ ఇయర్‌ఫోన్స్‌పై అద్భుతమైన డిస్కౌంట్ లభిస్తోంది. ప్రస్తుతం, వీటిని రూ. 2,749 ధర వదద్ కొనుగోలు చేయవచ్చు. సౌకర్యవంతమైన వ్యాయామ సెషన్ల కోసం వీటిలో ఇన్-ఇయర్ హుక్స్‌ను అందించారు. వినియోగదారులు మొత్తం మూడు కలర్ ఆప్షన్లలో వీటిని కొనుగోలు చేయవచ్చు. వీటిలో ఇన్-లైన్ కంట్రోల్‌ను అందించడం విశేషం. వీటిని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే చాలు ఏడు గంటల బ్యాటరీని అందిస్తాయి.
సెన్‌హైజర్ సిఎక్స్ 120 బిటి
రూ.3 వేల ధరలోపు లభించే ఇయర్ఫోన్లలో సెన్‌హైజర్ సిఎక్స్ 120 బిటి ఇయర్‌ఫోన్లు బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు. ప్రస్తుతం, వీటిని రూ. 1,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. వీటిలో బ్లూటూత్ 4.1 కనెక్టివిటీతో పాటు ఎస్‌బిసి, ఆప్టిఎక్స్ బ్లూటూత్ కోడెక్‌ల సపోర్ట్‌ను అందించారు. వీటిలో మల్టిపుల్ కనెక్టివిటీతో పాటు ఆప్టిఎక్స్ లో లాటెన్సీ కోడెక్ సపోర్ట్‌ను చేర్చారు. వీటిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు ఆరు గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తాయి.
0 Comments