కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడం, పరిస్ధితులు కాస్త అదుపులోకి రావటంతో ఇన్నాళ్లుగా నిలిచిపోయిన కొన్ని ఎక్స్ ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను ఈనెల 19 నుంచి పునః ప్రారంభిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. వీటిలో 16 ఎక్స్ ప్రెస్ రైళ్లు, 66 ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. ఈ నెల 19 నుంచి కొత్త నెంబర్లతో ఈ రైళ్లు నడుస్తాయని రైల్వే అధికారులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ప్యాసింజర్ రైళ్లకోసం టికెట్లు స్టేషన్ లోనే ఇస్తారని పేర్కొన్నారు. రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు కోవిడ్ నిబంధనలు తప్పని సరిగా పాటించాలని కోరారు. శానిటైజర్ వాడటం, మాస్క్ లు ధరించటం, భౌతిక దూరం పాటించటం వంటి నిబంధనలు తప్పని సరిగా పాటించాలని సూచించారు.
0 Comments