ఏపీ ఫైబర్ నెట్ ఇంటర్నెట్ వాడుతున్నారా?? కాని మీకు ఇంటర్నెట్ స్లో గా వస్తుందా ?? అయితే మీ ఇంటర్నెట్ ని మీకు తెలియకుండా ఎవరో వాడుతున్నట్లే.
ఇప్పుడు ఫైబర్ నెట్ లో SSID & వై-ఫై పాస్వర్డ్ ఎలా మార్చుకోవాలో చూద్దాం.
ముందుగా మీ వై-ఫై యొక్క IP అడ్రస్ ను మెనూ లోని MY Account ఓపెన్ చేసి STB info ని ఓపెన్ చేయండి. అక్కడ IP Address ఎదురుగా 192.168.55.102 అనే నంబర్స్ ను నోట్ చేస్కొండి. (ఒక్కో రౌటర్ లో ఒక్కో IP Address వేరు గా ఉండవచు.)
IP అడ్రస్ లోని 192.168.55.102 లో చివరి 102 లేకుండా 1 ను రీప్లేస్ చేయండి. అంటే 192.168.55.1 ఇది మీ వై-ఫై యొక్క డిఫాల్ట్ అడ్మిన్ లాగిన్ అడ్రస్.
ఏపీ ఫైబర్ నెట్ ను ఎవరెవరు వాడుతున్నారో తెల్సుకోవడం ఎలా??
App Store లోకి వెళ్లి Social మెనూ లో క్రోమ్ బ్రౌసర్ ఓపెన్ చేయండి.
అడ్రస్ బార్ లో 192.168.55.1 ఎంటర్ చేసి గో ప్రెస్ చెయ్యండి. మీకు Dasan లాగిన్ పేజి వస్తుంది. డిఫాల్ట్ లాగిన్ ID లో admin, అండ్ password లో vertex25 ఎంటర్ చేసి లాగిన్ అవండి.
మీకు రైట్ సైడ్ లో GPON Home Gateway కింద Status క్లిక్ చెయ్యండి.మీ ఇంటర్నెట్ ను ఎవరెవరు వాడుతున్నారో Current Wireless Users లో MAC అడ్రస్ తో సహా చూడొచ్చు.
ఏపీ ఫైబర్ నెట్ వై-ఫై లాగిన్ పాస్వర్డ్ మార్చటం ఎలా??
మీకు రైట్ సైడ్ లో GPON Home Gateway కింద Maintenance ఓపెన్ చేసి Adiministrator సెక్షన్ లో New Password లో మీ కొత్త పాస్వర్డ్ ని ఎంటర్ చేసి మళ్లి Confirm password లో మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి కిందకి స్క్రోల్ చేసి Apply క్లిక్ ivandi.మీరు 30 సెకండ్స్ తర్వాత లాగౌట్ అయపోతారు.సో మళ్లి లాగిన్ లో ID admin అండ్ Password లో కొత్త పాస్వర్డ్ తో లాగిన్ అవండి.
ఏపీ ఫైబర్ నెట్వై వై-ఫై పేరు & పాస్వర్డ్ మార్చటం ఎలా??
మీకు రైట్ సైడ్ లో GPON Home Gateway కింద Wifi Setup ఓపెన్ చేసి Wifi 2.4Ghz Settings సెక్షన్ లో SSID Settings lo SSID బాక్స్ లో మీ వై-ఫై కి పేరు ఏం కావాలో ఎంటర్ చేయండి.ఇంకా Authentication Type ని WPA2PSK కి, Use WPS ని Deactivated కి మార్చండి.
WPA-PSK సెక్షన్ లో
Pre-Shared Key లో మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి.(15 అంకెలు ఉంచడం మంచిది). చివరగా
Apply చేసి మీ మొబైల్స్ అన్నిట్లో కొత్త పాస్వర్డ్ తో కనెక్ట్ అవ్వండి.
0 Comments