Ad Code

what is GPS


గతంలో ఎక్కడకైనా కొత్త ప్రదేశానికి వెళితే, అక్కడ మనం ఎవరి చిరునామా అవసరమో, వారి గురించి బస్సు దిగిన దగ్గర నుంచి వారి వీధి వరకు ప్రతిఒక్కరినీ అడగటం అందరికీ అనుభవమే. టెలిఫోన్స్‌ కొంతమేర ఆ రకమైన ప్రయాసను తగ్గించాయనే చెప్పాలి. సెల్‌ఫోన్స్‌ వచ్చాక ఆ సమస్య మరికొంత సులువైంది. నగరాలు మహానగరాలుగా మారటంతో సమస్య మళ్లీ ముందుకు వస్తోంది.
ప్రస్తుతం దేశంలో జిపిఎస్‌(గ్లోబల్‌ పొజిషన్‌ సిస్టమ్‌) సర్వీస్‌ ద్వారా నగరంలో ఏ  ప్రాంతం ఎక్కడ ఉందో, దానికి సంబంధించిన సమస్త సమాచారం క్షణాల్లో మన కంప్యూటర్‌ స్క్రీన్‌పై కనిపిస్తుంది. మనక్కావల్సిందే కాదు మనం ఏ ప్రాంతంలో ఉన్నామో కూడా తెలిసిపోతుంది. ఏ ప్రాంతానికి వెళ్లదలిచారో ఆ ప్రాంతం పేరు టైప్‌చేయటం లేదా, స్క్రీన్‌పై ఆ ప్రాంతాన్ని మ్యాప్‌లో గుర్తించటం ద్వారా ఆ ప్రాంతానికి సులభంగా చేరుకోవచ్చు.
ట్రాఫిక్‌ జామ్‌ అయినా, వెళ్లటానికి వేరే మార్గాలను మ్యాప్‌లో చూపిస్తుంది. ఒకవేళ తప్పు దారిలో వెళుతున్నట్లయితే, జిపిఎస్‌ ఆ మార్గాన్ని ఎరుపు రంగులో చూపిస్తుంది. సరైన దారిలో వెళితే ఆకుపచ్చ రంగులో, చేరవలసిన ప్రాంతం సమీపిస్తే పసుపు రంగులో ఆ ప్రాంతాన్ని చూపిస్తుంది. ఈ జిపిఎస్‌కు అదనంగా ఇంటర్నెట్‌లో లభించే వికీపీడియా మ్యాప్‌ను జత చేస్తే చేరవలసిన ఫ్లాట్‌ అడ్రస్‌ను తెలుసుకోవటం మరింత సులభం.
అయితే మన దేశంలో ఈ సర్వీస్‌కు ప్రస్తుతం వెల ఎక్కువగా ఉన్నా, అభివృద్ధి చెందిన అమెరికా, ఆస్ట్రేలియా, యుకె వంటి దేశాల్లో జిపిఎస్‌ సిస్టమ్‌ కొనుగోలు చేస్తే డీఫాల్ట్‌గా అందులో ఆ దేశానికి సంబంధించిన మ్యాప్‌లను ప్రీలోడెడ్‌ చేసి ఉచితంగా ఇస్తారు. దీనికి  అక్కడ కంపెనీలు ఎటువంటి అదనపు రుసుము వసూలు చేయవు. ఒకేసారి జిపిఎస్‌ సిస్టమ్‌ను కొంటే చాలు. జీవితాంతం ఉచితంగా జిపిఎస్‌ సర్వీస్‌ పొందవచ్చు.
ఏమిటీ జిపిఎస్‌..
గ్లోబల్‌ పొజిషన్‌ సిస్టమ్‌ (జిపిఎస్‌) అమెరికా తన సైనిక అవసరాల కోసం ఏర్పాటు చేసింది. భూమి చుట్టూ ఉపగ్రహాలను నిరంతరం తిప్పుతూ, శత్రుదేశాల కదలికలను, మ్యాప్‌లను తెల్సుకోవటానికి ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ. ప్రస్తుతం ఈ టెక్నాలజీ పౌర అవసరాలకు కూడా వినియోగించుకొనే విధంగా మారింది. దీని సాయంతో జిపిఎస్‌ రిసీవర్లను కార్లలోను, పిడిఏల్లో ఏర్పాటు చేసుకోవటం ద్వారా కావలసిన ప్రాంతాన్ని సులభంగా తెల్సుకోవచ్చు. అమెరికాపై ప్రతిదానికీ ఆధారపడాల్సి వస్తోందని, దీనికి పోటీగా రష్యా గ్లోరిస్‌, యూరప్‌ ప్రత్యేమైనటువంటి స్వతంత్ర వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటున్నాయి.a

Post a Comment

0 Comments

Close Menu