లినోవా 3000 హెచ్‌ లిమిటెడ్‌ ఎడిష

ప్రముఖ కంప్యూటర్‌ తయారీ సంస్థ లినోవా, డిస్నీ కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌ సంయుక్తంగా లినోవా 3000 హెచ్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌ పవర్‌ రేంజర్స్‌ మైస్టిక్‌ ఫోర్స్‌ పేరుతో కొత్త డెస్క్‌టాప్‌ కంప్యూటర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రత్యేకించి గేమింగ్‌ పట్ల ఎక్కువ మక్కువ చూపే పిల్లలను లక్ష్యంగా చేసుకొని వీటిని విడుదల చేసినట్లు రెండు సంస్థలూ తెలిపాయి. ప్రత్యేకించి అద్భుత శక్తుల (మిస్టిక్‌ ఫోర్స్‌ సిరీస్‌) నేపధ్యంగా ఉన్నటువంటి గేమ్స్‌ పిల్లలను ఉర్రూతలూగిస్తుందని డిస్నీ సంస్థ అంటోంది. ఈ లినోవా 3000 హెచ్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌లో 17అంగుళాల ఎల్‌సిడి స్క్రీన్‌, ఇంటెల్‌ కోర్‌ 2 డూయెల్‌ ప్రాసెసర్‌, 1జిబి రోమ్‌, 250జిబి హార్డ్‌డిస్క్‌తో పాటు పవర్‌రేంజర్స్‌ బ్రాండెడ్‌ స్పీకర్స్‌. ఆప్టికల్‌ మౌస్‌ను ఇస్తున్నట్లు వెల్లడించారు. దీని ఖరీదు రూ.40,100. ఈ లిమిటెడ్‌ ఎడిషన్‌ మెట్రోపాలిటిన్‌ నగరాల్లోను, లినోవా అథరైజ్‌డ్‌ స్టోర్స్‌లో లభ్యమవుతుంది.

No comments

Telugu Unicode Converter Online

click here http://kolichala.com/font2unicode/Encoder/unicode2font.php

Powered by Blogger.