ప్రముఖ ఇంటర్నెట్‌ కంపెనీ రీఢఫ్‌

ప్రముఖ ఇంటర్నెట్‌ కంపెనీ రీఢఫ్‌ీ డాట్‌ కామ్‌ ఐ-షేర్‌ పేరిట సరికొత్త సర్వీస్‌ను ప్రారంభించింది. దీని ద్వారా తమ యూజర్లు వీడియోలను, పిక్చర్లను ఇతరులకు పంపించేందుకు ఇది ప్లాట్‌ఫారమ్‌గా ఉపయోగపడుతుందని సంస్థ వెల్లడించింది. ప్రత్యేకించి ఒకే రకమైన అభిప్రాయాలు, అభిరుచులు ఉన్న వ్యక్తులు తమ అభిప్రాయాలను, భావాలను ఒక దగ్గర ప్రదర్శించవచ్చునని పేర్కొంది. దీని ద్వారా భారతీయ యువత తమ ప్రతిభాపాటవాలను ఇంటర్నెట్‌ ద్వారా అందరికీ తెలియజెప్పవచ్చునని తెలిపింది. ఐ-షేర్‌ ద్వారా కేవలం వివిధ రకాలైన యూజర్లే గాక, కంపెనీలు సైతం తమ గురించి వెల్లడించే సౌలభ్యమూ ఉంటుందని తెలిపింది. కంపెనీ సిఇఓ, ఛైర్మన్‌ అజిత్‌ బాలకృష్ణన్‌ మాట్లాడుతూ ప్రస్తుతం పెరుగుతన్న సెల్‌ఫోన్ల వినియోగం ఫలితంగా ఈ సర్వీస్‌కు మంచి స్పందన వస్తుందని భావిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఈ సర్వీస్‌ యుట్యూబ్‌కు కాపీ కాదని, మరో ప్రత్యేకమైన సర్వీస్‌గా దీన్ని కంపెనీ డైరెక్టర్‌ అగర్వాల్‌ తెలిపారు. త్వరలో రియాలిటీ, టాలెంట్‌ షో 'వాయిస్‌ ఆఫ్‌ రెఢఫ్‌ీ ఆన్‌ జీ సారేగమప' ద్వారా యువతరంలోని టాలెంట్‌ను వెలికి తీస్తామని సంస్థ తెలియజేసింది.

No comments

Telugu Unicode Converter Online

click here http://kolichala.com/font2unicode/Encoder/unicode2font.php

Powered by Blogger.