Ad Code

ఈ సెల్‌ఫోన్‌ అత్యాధునికమైనటువంటి విండోస్‌ మెబైల్‌ఫోన్‌

హెచ్‌టిసి సెల్‌ కంపెనీ తొలిసారిగా దేశంలో టచ్‌స్క్రీన్‌ సెల్‌ఫోన్‌ను ప్రవేశపెట్టినట్లు తెలియజేసింది. ఇది ఇంచుమించుగా ఐ-ఫోన్‌ను సౌకర్యాలను పోలి ఉంది. ఈ సెల్‌ఫోన్‌ అత్యాధునికమైనటువంటి విండోస్‌ మెబైల్‌ఫోన్‌గా కంపెనీ అభివర్ణిస్తోంది. దీని ద్వారా మునివేళ్లతోనే పనులు సులభంగా చేయవచ్చు అంటోంది. ఇది స్మార్ట్‌గా ఉండటానినకి టచ్‌ ఎఫ్‌ఎల్‌ఓ టెక్నాలజీని వినియోగించినట్లు వెల్లడించింది. సాధారణంగా వాడే కాంట్రాక్ట్‌ ఫోన్‌బుక్‌ను అతిసులభంగా దీని ద్వారా వినియోగించవచ్చునని, అంతేగాక, వాయిస్‌ కాల్‌ ద్వారానూ ఫోన్‌ చేసే సౌలభ్యం ఉన్నట్లు కంపెనీ సిఇఓ పీటర్‌ చూ వెల్లడించారు. ఇందులో విండోస్‌ మెబైల్‌ 6 ఫ్రొఫెషన్‌ వర్షన్‌ను పొందుపరిచినట్లు తెలిపారు. దీంతో ఇ-మెయిల్‌కు చవ్చే హెచ్‌టిఎమ్‌ఎల్‌ ఫైళ్లను సులభంగా చదివే వీలుందని రూపకర్తలు తెలుపుతున్నారు. దీనిలో వైఫీ, బ్లూటూత్‌, ఏ2డిపి వంటి వైర్‌లెస్‌ టెక్నాలజీ బదలాయింపు సౌలభ్యం ఉంది. బరువు 112గ్రాములు. 128ఎమ్‌బి మెమరీతో పాటు అదనంగా స్లాట్‌ ఉంది. దీని ఖరీదు రూ.19,990.

Post a Comment

0 Comments

Close Menu