Ad Code

మోడెం అంటే మోడ్యూలేటర్



మోడెం
మోడెం అంటే మోడ్యూలేటర్‌, డీ మోడ్యూలేటర్‌. దీని ద్వారా డేటా, ఫొటో లాంటి వాటిని ఒక కంప్యూటర్‌ నుండి మరో కంప్యూటర్‌కు పంపవచ్చు.
మోడెం పని చేయడానికి కావలసిన పరికరాలు
1) కంప్యూటర్‌
2) మోడెం
3) టెలిఫోన్‌ లైన్‌
4) కమ్యూనికేషన్‌ సాఫ్ట్‌వేర్‌ (బిట్‌వేర్‌)
మోడెం వెనుక భాగంలో వుండే ఫోర్టులు
ఆన్‌/ఆఫ్‌ స్విచ్‌ ా మోడెంను ఆన్‌/ఆఫ్‌ చేయవచ్చు
ఎసిాఇన్‌ ా పవర్‌ కేబుల్‌ పెట్టడానికి ఉపయోగపడుతుంది
ఆర్‌ఎస్‌ 232 ఫోర్ట్‌ ా కంప్యూటర్‌కు మోడెంను కలిపే కేబుల్‌ పెట్టడానికి ఉపయోగపడుతుంది.
లైన్‌, ఫోన్‌ / లైన్‌ అనేది దానిలో కేబుల్‌ పెడితే మోడెం కనెక్ట్‌ అవుతుంది. ఫోన్‌ అనే దానిలో ప్యార్‌లల్‌ కేబుల్‌ పెడితే ఫోన్‌ కూడా పనిచేస్తుంది
మోడెం ముందు భాగంలో వుండే ఫోర్టులు
1) ఆర్‌డి : రిసీవ్‌ డేటా (డేటా వచ్చేటప్పుడు ఈ లైట్‌ బ్లింక్‌ అవుతుంది)
2) టిడి : ట్రాన్సఫర్‌ డేటా (డేటా పంపేటప్పుడు ఈ లైట్‌ బ్లింక్‌ అవుతుంది)
3) సిడి : కేరీ డేటా (ఈ లైట్‌ వెలిగితే అవతలి వారితో అనుసంధానం అయినట్లు)
4) ఓహెచ్‌ : ఆఫ్‌ హుక్‌ (ఇది వెలిగితే మోడెం కనెక్ట్‌లో వుండి లైన్‌ ఉపయోగంలో వున్నట్లు)
5) హెచ్‌ఎస్‌ : హైస్పీడ్‌లో కనెక్ట్‌ అయినప్పుడు వెలుగుతుంది
6) ఎంఆర్‌ :మోడెం రెడీ (మోడెం పనిచేస్తున్నట్లు)

స్కానర్‌
ఇది డాక్యుమెంట్లను, ఫొటోలను స్కాన్‌ చేయడానికి ఉపయోగపడుతుంది. అవుటర్‌ డివైజ్‌లు సిస్టమ్‌కన్నా ముందుగా ఆన్‌ చేసుకోవాలి. సిస్టమ్‌ ఆన్‌లో వుండగా వాటిని కనెక్ట్‌ చేయకూడదు. అలా చేస్తే ఓఎస్‌ కరెఫ్ట్‌ అయ్యే ప్రమాదం వుంది. ముందుగా స్కానర్‌ డోర్‌ను ఓపెన్‌ చేసిన మనం స్కాన్‌ చేయవలసిన దానిని అందులో వుంచాలి.
తరువాత సిస్టమ్‌లోని ఫొటోషాప్‌ సాఫ్ట్‌వేర్‌ ఓపెన్‌ చేయాలి. (స్కానర్‌ను ఉపయోగించుకోవాలంటే సిస్టమ్‌లో ముందుగానే స్కానర్‌తో పాటు ఇచ్చే సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేయాలి. అది ఫొటోషాప్‌ సాఫ్ట్‌వేర్‌లో ఇన్‌స్టాల్‌ అవుతుంది.) ఫొటోషాప్‌లోని ఫైల్‌ మెనూలో వున్న ఇంఫోర్ట్‌నందు వున్న స్కానర్‌ సాఫ్ట్‌వేర్‌పై మౌస్‌తో క్లిక్‌ చేస్తే స్కానర్‌ ఓపెన్‌ అవుతుంది. దానిలోని ప్రివ్యూ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే స్కానర్‌లో మనం పెట్టిన డాక్యుమెంట్‌ ఎక్కడ వుందో కనబడుతుంది. మనం స్కాన్‌ చేయదలచిన ఫైల్‌ను సెలెక్ట్‌ చేసుకొని స్కాన్‌ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే స్కాన్‌ అయ్యి ఫొటోషాప్‌లోకి ఇంపోర్ట్‌ అవుతుంది. తరువాత స్కానర్‌ సాఫ్ట్‌వేర్‌ ఎగ్జిట్‌ చేయాలి.
అలా ఫొటోషాప్‌లోకి వచ్చిన ఫైల్‌ను దానిలోని టూల్‌తో మనకు కావలసిన విధంగా ఎడిట్‌ చేసుకొని సేవ్‌ చేసుకోవాలి.
స్కానర్‌ సెట్టింగ్స్‌
జనరల్‌
స్కాన్‌ పేజీ ఫర్‌
మోడ్‌ ా కస్టమ్స్‌
రిజల్యూషన్‌ ా ట్రూ కలర్‌
సైజ్‌ ా మినిమమ్‌ 300 డిపిఐ (డాట్‌ ఫర్‌ ఇంచ్‌)
మెజర్‌మెంట్‌ ా సెంటీ మీటర్లు
సైజ్‌ - ఎ 4
అడ్వాన్స్‌ - సెలెక్ట్‌
ఛానల్‌ -ఆల్‌
గామా - 100
షారప్‌నెస్‌ - 0

Post a Comment

0 Comments

Close Menu